News August 23, 2025

చేయి లేదని కట్టుకథ అల్లాడు!

image

‘నేను దివ్యాంగుడిని. అన్యాయంగా నా పింఛన్ తీసేశారు’ అంటూ బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన రమేశ్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఒడిగట్టాడారు. తన చెయి వెనక్కి మడత పెట్టి అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. నిజానికి అతడికి రెండు చేతులూ బాగున్నాయని గ్రామస్థులు చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. బండారం బయటపడటంతో చర్యలు తీసుకుంటారన్న భయంతో గ్రామం నుంచి పరారైనట్లు తెలిసింది.

Similar News

News January 19, 2026

స్పెయిన్ రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య

image

దక్షిణ స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో హైస్పీడ్ రైలు అడముజ్ సమీపంలో పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదేళ్ల కాలంలో స్పెయిన్‌లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే.

News January 19, 2026

విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

image

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.

News January 19, 2026

మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

image

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.