News May 13, 2024
చేవెళ్లలో ఓటేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News December 15, 2025
HYD: ఇందిరా గాంధీలో మరో కోణం ఈ బుక్

ఇందిరా గాంధీని రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాక, ప్రకృతితో ఆత్మీయ బంధం కలిగిన వ్యక్తిత్వంగా ఆవిష్కరించిన నవల ‘ఇందిరా గాంధీ: ఒక ప్రకృతి ప్రేమికురాలి జీవితం’. అధికార శిఖరంపై ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను రచయిత సజీవంగా చిత్రించారు. రాజకీయ జీవితం- ప్రకృతి ప్రేమ మధ్య సమతౌల్యాన్ని చూపిన ఈ నవల జీవన విలువలను గుర్తుచేసే గొప్ప రచనగా నిలుస్తుంది.
News December 15, 2025
HYD: అనుమతులు మేమిస్తాం.. కాదు మేమిస్తాం

GHMCలో ORR లోపలి ప్రాంతాలు విలీనం అనంతరం అనుమతుల లొల్లి ప్రారంభమైంది. GHMC, HMDA సంస్థలు అనుమతులు మేమిస్తామంటే.. మేమిస్తామని సర్కారుకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇంతవరకు హైరైజ్ అపార్టుమెంట్లు, కొత్త లే అవుట్ల అనుమతులన్నీ HMDA ఇచ్చేది. ఇపుడు ఆయా ప్రాంతాలన్నీ గ్రేటర్‌లో విలీనం కావడంతో పర్మిషన్స్ ఎవరిస్తారనే విషయం చర్చనీయాంశమైంది. విలీనంతో హెచ్ఎండీఏ ఆదాయం భారీగా కోల్పోనుంది.
News December 15, 2025
HYDలో సరికొత్త చాట్ కోడ్..!

HYD యువత ఇప్పుడు ఇంగ్లిష్, తెలుగు, దఖిని (Dakhni) పదాలతో ‘హైబ్రిడ్-హింగ్లిష్’ భాషా విప్లవాన్ని సృష్టిస్తున్నారు. బైగన్ (పనికిరాని), క్యా యార్ (ఏంటిరా), ఖాళీ-పీళీ(అనవసరంగా) వంటి పదాలు ఇందులో కీలకం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్థానిక గుర్తింపును చాటుకుంటున్నారు. అందరికీ అర్థంకాని ఈ భాష, కొత్త మీమ్స్ ద్వారా రోజురోజుకూ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాపార్డర్ భాషగా దూసుకుపోతోందని తెలుసా!


