News April 26, 2024
చేవెళ్లలో 64 మంది 88 నామినేషన్లు

RR జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి నాలుగో సెట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన తనయుడు కాసాని వీరేశ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వతంత్రులు నామినేషన్ వేశారు.
Similar News
News April 14, 2026
HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.
News April 14, 2026
HYD: ఇన్ఫెక్షన్ పెరుగుతోంది.. జాగ్రత్త!

HYDలోని CCMB తాజా అధ్యయనంలో కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియాల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతున్నట్లు వెల్లడైంది. పరిశోధనలో 45% బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకంగా మారినట్లు గుర్తించారు. క్లెబ్సియెల్లా, న్యుమోనియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతుల్లో ఈ ప్రతిరోధక శక్తి ఎక్కువగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్‌ను తట్టుకోగల శక్తిగా మారాయని తేలింది.


