News December 1, 2025

చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

image

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్‌గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.

Similar News

News February 7, 2026

మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

News February 7, 2026

రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. జపాన్ మ్యాగజైన్‌పై సోలో ఫొటో

image

రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన పాపులర్ లైఫ్‌స్టైల్ వీక్లీ మ్యాగజైన్ ‘Anan’ ఫిబ్రవరి ఎడిషన్‌ బ్యాక్ కవర్‌పై సోలోగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత జపాన్‌లో ఏర్పడిన భారీ ఫ్యాన్‌బేస్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. గతంలో ‘RRR’ సక్సెస్ తర్వాత 2023లో రామ్‌చరణ్, NTR కలిసి కవర్‌పై కనిపించగా, ఈసారి ప్రభాస్ సోలోగా మెరిశారు.

News February 7, 2026

అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. 2026–28 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు. మీడియా యజమాన్యాలు తమ ప్రతినిధుల పేర్లను డీపీఆర్ఓకు పంపించాలన్నారు. https://ipr.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.