News January 29, 2025
చోడవరం: అసత్య ఆరోపణలను ఖండించిన జనసేన నేత

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేస్తున్న అసత్య ఆరోపణలను చోడవరం జనసేన ఇన్‌ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఖండించారు. మంగళవారం చోడవరం జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి నష్టం జరుగుతుందని, ఎంపీ సీఎం రమేశ్ మైనింగ్ దందాకి పాల్పడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Similar News
News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.
News February 14, 2025
టెక్కలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

టెక్కలి ఆధి ఆంధ్రావీధి జాతీయ రహదారిపై ఉన్న ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రాజెక్టు సిబ్బంది చూసి RWS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
IPL ఫ్యాన్స్‌కు షాక్!

జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా <<15456249>>ఏర్పడిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే IPL కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘జియో హాట్‌స్టార్’ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీనికి 3 నెలలకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. Ad Free ఆప్షన్ కోసం రూ.499 వెచ్చించాలి. MAR 22 నుంచి IPL ప్రారంభమయ్యే అవకాశం ఉంది.