News March 27, 2024
చౌడేపల్లి: రామచంద్ర యాదవ్‌పై కేసు నమోదు

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 10, 2026
ఎల్లుండి నుంచి మొగిలిలో బ్రహ్మోత్సవాలు

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని స్వయంభు మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు.
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.
News February 10, 2026
మార్చి 15 లోపు పనులు పూర్తి: చిత్తూరు కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్టీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047విజన్ లక్ష్యంలో భాగంగా 10సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంతో ఎస్పీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.


