News September 9, 2025

జంగారెడ్డిగూడెం: ఆగస్ట్ వరకు 117 కేసులు.. 113 మంది అరెస్ట్

image

జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్‌లో నిరంతర దాడులు నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనుబాబు మంగళవారం తెలిపారు. జనవరి నుంచి ఆగస్ట్ వరకు నాటు సారా కేసులు 29, బెల్లం ఊట 12, అనధికార మద్యం అమ్మకాలపై 42 కేసులు నమోదు చేశామన్నారు. 113 మందిని అరెస్ట్ చేసి 4 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ప్రజలు ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.

Similar News

News December 10, 2025

KNR: పోలింగ్ కేంద్రాలకు తరలిన పోలింగ్ సిబ్బంది

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 92 గ్రామపంచాయతీలో ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో గంగాధర, రామడుగు, కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాలలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.

News December 10, 2025

WGL: నిత్యావసరాల ధరల నియంత్రణపై ప్రశ్నించిన ఎంపీ

image

దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నాణ్యత నియంత్రణపై లోక్ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నాణ్యత నియంత్రణలో లోపాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన వస్తువులు సరైన ధరకే, ప్రమాణాలతో అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

News December 10, 2025

తిరుపతి జిల్లా స్కూల్లో కొత్త టెక్నాలజీ

image

విదేశాల్లో అమలవుతున్న క్లికర్ సాంకేతిక విధానాన్ని విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా తిరుపతిలోని SPJNM, గూడూరు ZP గర్ల్స్ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు పాఠం చెప్పిన తర్వాత దానిపై వీడియో చూపిస్తారు. అందులోని ప్రశ్నలకు విద్యార్థులు క్లికర్‌తో సమాధానాలు ఇస్తారు. దీని ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకోవచ్చని DEO కుమార్ తెలిపారు.