News October 7, 2025
జంగారెడ్డిగూడెం: పోలీస్ జాగిలంతో తనిఖీలు

జంగారెడ్డిగూడెంలో పోలీసులు మంగళవారం జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. సీఐ సుభాశ్, ఎస్ఐ జబీర్‌లు బస్టాండ్, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. జాగిలాలతో బస్ స్టాండ్‌లోని ప్రయాణికుల లగేజీలు, పార్శిల్ ప్రాంతాలు, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. రవాణా కేంద్రాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాలు నివారించడమే లక్ష్యంతో ఈ తనిఖీలు చేశామని సీఐ తెలిపారు. –
Similar News
News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
News January 13, 2026
పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 13, 2026
సంగారెడ్డి: హాజరు ఆధారంగానే జీతాలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


