News March 31, 2024
జక్రాన్ పల్లిలో ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లిలో జరిగింది. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(42) బాల్ నగర్ నుంచి స్కూటీ పై సికింద్రాపూర్‌కి వస్తుండగా వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.