News October 8, 2025
జగన్ కాన్వాయ్‌లో ఈ షరతులు తప్పనిసరి: పోలీసులు

➤ కాన్వాయ్‌తో ర్యాలీలు, రోడ్ మార్చ్‌లు నిషేధం
➤ Z+ భద్రతా నిబంధనల ప్రకారం ఎస్కార్ట్, పైలట్, బ్యాకప్ వాహనాలతో సహా మొత్తం 10వాహనాలకు మించకూడదు
➤ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలు చేరకూడదు
➤ కార్యక్రమం ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ పేరు, కాంటాక్ట్ నంబర్ ట్రాఫిక్ ACPకి సమర్పించాలి
ఈ షరతులను ఉల్లంఘించినట్లైతే <<17944917>>అనుమతి<<>> రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 17, 2026
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్, స్పోర్ట్స్ వెల్ఫేర్ ఐజీగా గజరావ్ భూపాల్, ఫ్యూచర్ సిటీ ఏసీపీ(అడ్మిన్-ట్రాఫిక్)గా చందనా దీప్తి, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వ రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతీ, సైబరాబాద్ డీసీపీ(అడ్మిన్)గా టి.అన్నపూర్ణ, సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమించింది.
News January 17, 2026
రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.
News January 17, 2026
తిరుపతి: డ్రైవర్ల కష్టాలు.. ఇంకెంతకాలం.!

జిల్లా వాసులు టాక్సీలకు FC రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. TPT, తిరుమల కేంద్రంగా అనేక టాక్సీలు నడుస్తున్నాయి. లారీలు, ఇతర వాహనాలు సైతం పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ATC(ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్) లేకపోవడంతో అటు చిత్తూరు(D)లోని బంగారుపాళ్యం ATC, ఇటు నెల్లూరు(D) ముత్తుకచూరు ATCకి వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరారు.


