News August 22, 2025

జగన్ పథకాలను కాపీకొట్టడమే చంద్రబాబుకు తెలుసు: కాకాణి

image

CM చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, YCP అధినేత జగన్‌ పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కీలక సమయంలో ఎరువులు అందలేదు. YCP ప్రభుత్వం RBKల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది’ అని అన్నారు.

Similar News

News January 19, 2026

నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

image

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.

News January 19, 2026

నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.

News January 19, 2026

నెల్లూరు: ఇరిగేషన్లో రూ.100 కోట్లు పక్కదారి!

image

మొంథా తుఫాను నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాకు రూ.100 కోట్లు మంజూరైతే.. పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. ఈ వ్యవహారంలో ఓ DAO తన కొడుకు, బంధువుల ఫోన్ పేకి అమౌంట్ ట్రాన్సఫర్ చేయించుకోవడంతో అవినీతి బట్ట బయలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయికి చేరడంతో విచారణ అధికారి వచ్చి వెళ్లారు కానీ ఫైళ్లు ముందుకు కదలలేదు. తుఫానుతో చెరువులు కరకట్లు, షట్టర్లు, కాలువల మరమ్మతుల చేపట్టిన దాఖలాలు లేవు.