News December 1, 2025
జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్‌ని తెచ్చారు: కోటంరెడ్డి

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.
Similar News
News February 10, 2026
SVU : డిగ్రీ పూర్వ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.
News February 10, 2026
నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లుకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంట్రీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాల్సి ఉంది.
News February 10, 2026
ఉదయగిరి: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్ ?

దేశంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోని వారి కార్డులు నిలిపివేసినట్లు ఉదయగిరి ఆధార్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ చేయాలనుకున్న ముందుగా వాటి చెల్లుబాటు స్థితి తప్పనిసరిగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. రద్దు చేయబడిన, నిలిపివేయబడిన, చెల్లుబాటు కోల్పోయిన వారు ప్రాథమిక ఆధార్ కేంద్రాలను లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.


