News August 23, 2025

జగిత్యాలలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

image

ఈశా గ్రామోత్సవం పేరిట ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని ఈనెల 23, 24న జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు. పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో తమ జట్లను ఉచితంగా నమోదు చేసుకుని పాల్గొనాలన్నారు. గెలిచిన మొదటి 4 జట్లకు నగదు బహుమతి ఉంటుందన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 21న ఈషా యోగ సెంటర్ కోయంబత్తూర్ లో జరుగుతుందన్నారు.

Similar News

News January 23, 2026

NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు పోస్టర్ ఆవిష్కరణ

image

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు డీఎమ్ డబ్ల్యూఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు tgmreistelangan.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 23, 2026

NGKL: జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం పేర్కొన్నారు. మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న పంట అధికంగా సాగు చేయడం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రైతులకు 21.802 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు.

News January 23, 2026

కొడకండ్ల: ముగ్గురికి జీవిత ఖైదు

image

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు నమోదైన ఘటన కొడకండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన బూర్గుల ప్రభాకర్‌ను 2017లో హత్య చేసిన భార్య బూర్గుల పూలమ్మ, కుమారులు మురళి, శ్రీకాంత్‌లు కలిసి రోకలిబండతో కొట్టి చంపగా.. నేడు రుజువు అవడంతో జనగామ జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.