News August 13, 2025

జగిత్యాలలో డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ టీమ్‌లు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, వంతెనలు వంటి చోట్ల బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News March 16, 2026

వచ్చే ఏడాదే పోలవరం జాతికి అంకితం: CBN

image

AP: గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని CM CBN పునరుద్ఘాటించారు. ‘YCP పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.

News March 16, 2026

పుట్టపర్తి కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు జయంతి

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పలువురు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

News March 16, 2026

నంద్యాలలో పొట్టి శ్రీరాములు జయంతి

image

నంద్యాల సంజీవ్ నగర్ సర్కిల్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కలెక్టర్ కొనియాడారు. కులమత భేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు.