News August 13, 2025

జగిత్యాల: ‘అర్హులైన మహిళలను సంఘాల్లో చేర్చాలి’

image

అర్హులైన మహిళలను తప్పనిసరిగా సంఘాల్లో చేర్చాలని DRDO రఘువరణ్ తెలిపారు. JGTL కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణా తరగతిలో మాట్లాడారు. సెర్ప్ ఆదేశాల మేరకు వృద్ధ మహిళలు, దివ్యాంగులు, స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే గృహిణులను వర్గాలవారీగా సంఘాలలో చేర్చాలని సూచించారు. గ్రామ స్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అర్హులను గుర్తించాలన్నారు. 15-30 తేదీల్లో సంఘాల ఏర్పాటు, బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలన్నారు.

Similar News

News March 16, 2026

స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎలా ఉన్నాయంటే?

image

యుద్ధ ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు నిలిపివేసి పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, హిందాల్కో, ITC, టాటా స్టీల్, అపోలో, కొటక్, సిప్లా, ఇండిగో షేర్లు లాభాల్లో ఉన్నాయి. బెల్, శ్రీరామ్ ఫైనాన్స్, ONGC, HAL, M&M, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News March 16, 2026

భగ్గుమంటున్న నల్లమల.. ముప్పులో వన్యప్రాణులు

image

ఎండలు పెరగడంతో 2,611 చ.కి.మీ. విస్తీర్ణంలోని నల్లమల అడవుల్లో కార్చిచ్చు రేగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 50చోట్ల మంటలు చెలరేగగా, గతేడాది 1,026హెక్టార్ల అడవి బుగ్గిపాలైంది. 70-80% ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మంటల నివారణకు 29బేస్ క్యాంపులు, 94ఎయిర్ బ్లోయర్లతో సిబ్బంది నిరంతరం నిఘా ఉంచారు. శాటిలైట్ సాయంతో మంటలను గుర్తించి అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

News March 16, 2026

శ్రీకాకుళం: రెండు నెలల్లో.. ఐదు బ్యాంకు ఉద్యోగాలు..!

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో ఆదర్శంగా నిలిచారు. వివాహం తర్వాత అత్తవారి ఇంట్లో ఉంటూనే పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన స్వప్న, తన విజయంతో మహిళల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.