News September 10, 2025
జగిత్యాల: ఇక భూములకు ప్రత్యేక భూధార్ కార్డులు

ప్రతి వ్యక్తికి జారీ చేసిన ఆధార్ కార్డు లాగ, ఇక ప్రతి భూమికి భూధార్ కార్డును జారీ చేయనున్నారు. దీని ఆధారంగా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, ఏ విధంగా సంక్రమించింది, బీమా, బ్యాంకు రుణాల వంటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్ల, ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.
Similar News
News December 16, 2025
పేరుకే కొలువు.. వేతనాలు అందక 9 నెలలు!

నెలల తరబడి వేతనాలందక జిల్లాలోని ‘104’ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు కొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరి పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 100కు పైగానే 104 సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
News December 16, 2025
చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.
News December 16, 2025
దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.


