News August 12, 2025

జగిత్యాల: ఈనెల 13న ఇంటర్వ్యూలు

image

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈ నెల 13న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. SSC, INTER, డిగ్రీ చదివినవారు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులన్నారు. రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10:30 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

Similar News

News March 14, 2026

నాయుడుపేట: అదృష్టమంటే ఆమెదే మరి..!

image

చోరీకి గురైన వడ్డానం కొరియర్‌లో బాధితురాలు ఇంటికి చేరింది. నాయుడుపేట మండలం పండ్లూరు సమీపంలోని ఓ హోటల్లో ఇటీవల వేడుక జరిగింది. రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఆమె 16 సవర్ల వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వడ్డాణం బాధితురాలు ఇంటికి కొరియర్‌లో వచ్చింది.

News March 14, 2026

IPLలో ఆడనున్న ముజరబాని.. పాక్ బోర్డు లీగల్ యాక్షన్!

image

PSL కాంట్రాక్ట్‌‌ను <<19375126>>వదులుకొని<<>> IPLలో KKR తరఫున ఆడటానికి సిద్ధమైన ముజరబాని(ZIM)పై లీగల్ యాక్షన్‌కు పాక్ క్రికెట్ బోర్టు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో ఇస్లామాబాద్ టీమ్ నుంచి తప్పుకోవడాన్ని సవాల్ చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ తొలుత పెషావర్ జల్మీ డైమండ్ జట్టులో చేరి తర్వాత MI టీమ్‌కు షిఫ్ట్ అయ్యారు. కాగా PSL మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.

News March 14, 2026

యాదాద్రి: అక్కది ప్రమాదం కాదు హత్య.. న్యాయం కోసం తమ్ముడి పోరాటం

image

మోత్కూరు (M) పాటిమట్లలో గత నెల 26న జరిగిన కారు ప్రమాదంపై మృతురాలు ఓర్సు వినోద తమ్ముడు క్రాంతి కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అది ప్రమాదం కాదని, తన బావ రమేశ్ ప్లాన్‌తో చేసిన హత్య అని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారును కావాలనే చెట్టుకు ఢీకొట్టి చంపారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడుతానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.