News September 12, 2025

జగిత్యాల: ఈనెల 20న క్రీడా పోటీలు

image

జగిత్యాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 20న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలతోపాటు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిమ్మకాయ చెంచా, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

తిరుపతి: మరో ప్రొఫెసర్‌‌ది అదే డిపార్ట్మెంట్.!

image

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.

News December 7, 2025

తిరుపతి: వర్సిటీ ICC ఏమి చేసింది.!

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై వేధింపుల కేసులో INTERNAL COMPLAINT COMMITY (ICC) ఇద్దరు ప్రొఫెసర్లను విచారించినట్లు చర్చ నడుస్తుంది. ఈ కమిటీలోని నలుగురు సభ్యులు అసిస్టెంట్ ప్రొ.లక్ష్మణ్ కుమార్‌ను ప్రశ్నించగా ‘యువతిని తీసుకురాండి.. నాపై అనవసరంగా ఫిర్యాదు చేసింది’ అని చెప్పినట్లు సమాచారం.

News December 7, 2025

37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

image

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.