News April 25, 2025

జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్‌కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News March 9, 2026

BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.

News March 9, 2026

వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

image

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.