News April 30, 2024
జగిత్యాల: ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోహర్‌ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పెరకపల్లి గ్రామానికి చెందిన తిరుపతి మామ గంగాధర్ వద్ద రూ.5,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తిరుపతి, సీఐ క్రిష్ణ కుమార్ పట్టుకున్నారు. దుబాయిలో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి మెయిల్ ద్వారా ACB DGకి ఫిర్యాదు చేశారు.
Similar News
News April 16, 2026
నిప్పుల కొలిమిలా కరీంనగర్ జిల్లా!

KNR జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గురువారం జిల్లావ్యాప్తంగా ఎండలు ముదిరి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మానకొండూరు మండలం ఈదుల గట్టపల్లిలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ మధ్యలోనే వడగాల్పులు మొదలవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 16, 2026
కరీంనగర్ : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు ఘన వీడ్కోలు

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.
News April 15, 2026
KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.


