News August 13, 2025
జగిత్యాల: కంట్రోల్ రూం ఏర్పాటు

నేటి నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని జగిత్యాల SE బి.సుదర్శనం కోరారు. ఎటువంటి విద్యుత్ అంతరాయం ఏర్పడినా పునరుద్దరణ టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని తెలిపారు. 8712486131, 8712486133, 8712486325 నంబర్స్ సంప్రదించాలన్నారు.
Similar News
News March 7, 2026
కరీంనగర్: ప్రజా పాలనపై మంత్రుల కీలక సమీక్ష!

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో.. జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో ఫైళ్ల పర్యవేక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
News March 7, 2026
US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.
News March 7, 2026
వార్ ఎఫెక్ట్.. రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

ముడి చమురు ధర దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90 డాలర్లకు పెరిగింది. 2024 APR తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్ హైక్ చివరగా 2020 ఏప్రిల్‌లో నమోదైంది. ఇరాన్‌తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్‌లో తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి.


