News September 9, 2025
జగిత్యాల: కాళోజీ రచనలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించాయి: కలెక్టర్

ప్రజాకవి కాళోజీ రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
జనగామ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి!

2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో పరీక్షను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.
News December 12, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

నార్కట్ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్ఐ
నల్గొండ: జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
నల్గొండ: సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిరేకల్: అటవీశాఖ అధికారులకు గుడ్లగూబ అప్పగింత
చండూరు: కస్తాలలో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలుపు
కట్టంగూర్: వార్షిక వేడుకలకు నిష్కలంక మాత ఆలయం సిద్ధం
శాలిగౌరారం: 22 ఏళ్లకే ఉపసర్పంచిగా ఎన్నిక
నిడమనూరు: విధులు బహిష్కరించిన న్యాయవాదులు
News December 12, 2025
పొందూరు ఖాదీకి GI ట్యాగ్ గుర్తింపు

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


