News March 26, 2025

జగిత్యాల: గణితం పరీక్షకు రెగ్యూలర్‌కు 5 విద్యార్థులు గైర్హాజరు

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నాలుగోరోజు గణితం పేపర్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11855 విద్యార్థులకు 11850 విద్యార్థులు హాజరయ్యారు. 5 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.96%.సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 133 విద్యార్థులకు 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరు శాతము 89.47% అని అధికారులు తెలిపారు.

Similar News

News April 24, 2025

NLG: వడదెబ్బకు పిట్టల్లా

image

భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62) మృతి చెందారు. ఇటీవల పానగల్‌కు చెందిన కస్పరాలు కనకయ్య, కేతేపల్లి మండలం తుంగతుర్తి వాసి గుంటి వెంకటరమణ వడదెబ్బతో మృతిచెందారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 24, 2025

హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

image

HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్‌పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్‌(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్‌లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

News April 24, 2025

పెదపాడు: రూ.15.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు

image

పెదపాడు మండలం వసంతవాడకు చెందిన ఓ వృద్ధుడు సైబర్ మోసానికి బలయ్యాడు. ఎస్‌ఐ శారద సతీశ్ వివరాల ప్రకారం.. బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఓ వ్యక్తి వృద్ధుడికి ఫోన్ చేశాడు. తనపై కేసు నమోదు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. భయపడిన వృద్ధుడు రూ.15.50 లక్షలను కేటుగాడి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఈ మోసాన్ని గ్రహించిన వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!