News August 21, 2025
జగిత్యాల: ‘గణేష్ మండపాలకు వసతులు కల్పించాలి’

జగిత్యాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని మండపాల వద్ద శానిటేషన్, ఇతర వసతులు కల్పించాలని కోరారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వార్డుల్లోని మండపాల వద్ద మొరం పోసి చదును చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 20, 2026
భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు చేరాలి: డిప్యూటీ సీఎం

కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పట్టణ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరులో జాప్యం జరగకూడదని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరాలన్నారు.
News January 20, 2026
దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.


