News October 3, 2024
జగిత్యాల: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హఠాత్మరణం

గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల LFL ప్రధానోపాధ్యాయుడు కోగుల రవిబాబు బుధవారం సాయంత్రం ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Similar News
News December 10, 2025
KNR: తొలి విడత జీపీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మండలాల్లో డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 92 పంచాయతీల పరిధిలోని 866 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధం. నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు.
News December 10, 2025
కరీంనగర్: ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కేటాయింపు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది SIలు, 34మంది హెడ్ కానిస్టేబుల్స్, 392మంది కానిస్టేబుళ్ళు, 47మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులని ఆయన తెలిపారు. పోలింగ్ బందోబస్తు చేసే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.
News December 10, 2025
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,450 పలకగా.. బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్‌కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.


