News January 22, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ, వార్డుసభలు @ధర్మపురి మండలంలోని జైన గ్రామసభలో పాల్గొన్న మంత్రులు @ మేడిపల్లిలో లక్ష డప్పులు వేయి గొంతుకల కార్యక్రమంపై సమావేశం @ ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయానికి రూ.69,573 ఆదాయం @రాజారాంలో యాక్సిడెంట్.. కిలోమీటర్ దూరం నిలిచిన ట్రాఫిక్ @ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే @ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ.

Similar News

News February 19, 2025

మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.

News February 19, 2025

వరంగల్‌కు నూతన మూల్యాంకన క్యాంపు

image

వరంగల్ జిల్లా కేంద్రంగా ఇంటర్ నూతన మూల్యాంకన క్యాంపు మంజూరు చేసినట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. గతంలో హన్మకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల ఇంటర్ సిబ్బంది మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో తరగతి గదులు, కార్యాలయం, సౌకర్యాలను పరిశీలించిన పిమ్మట నూతన క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

News February 19, 2025

మస్క్: నలుగురితో సంసారం, 13 మంది పిల్లలు

image

అపరకుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఏకంగా 13 మంది పిల్లలకు తండ్రి అని నేషనల్ మీడియా పేర్కొంది. ఆయన నలుగురితో సంసారం చేయగా, వారికి 13 మంది పిల్లలు కలిగినట్లు తెలిపింది. మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు ఉన్నారు.

error: Content is protected !!