News February 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@జగిత్యాల మాత శిశు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ @కలెక్టరేట్ లో పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం @వెల్గటూరులో విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం @ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం @జగిత్యాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మి తనిఖీలు @కోరుట్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం @కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

Similar News

News February 12, 2026

ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబ‌ర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.

News February 12, 2026

నర్సీపట్నంలో పెద్దల అండతోనే దోపిడీ: YCP ట్వీట్

image

నర్సీపట్నంలో రాజేశ్, శరత్‌ను CBI అధికారులు <<19113870>>అరెస్టు<<>> చేశారు. కౌన్సిలర్ చంద్రిక భర్త అయిన రాజేశ్ కూటమి పెద్దల అండతోనే వ్యాపారాలు చేస్తున్నట్లు YCP పేర్కొంది. విద్యాసంస్థల సొసైటీ నుంచి రూ.2 కోట్లు తన ఖాతాకు బదిలీ చేయించడమే గాకా IRS అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడంది. ‘మీ కూటమిలో బ్యాంకు రుణాల ఎగవేతదారులే ఉన్నారనుకున్నాం.. ఇలాంటి ఘరానా మోసగాళ్లు కూడా ఉన్నారా’ అంటూ CMని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

News February 12, 2026

రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

image

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.