News December 2, 2025

జగిత్యాల జిల్లాలో నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు

image

జగిత్యాల(D) పరిధిలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ యాక్ట్ 1861 అమలులోకి వచ్చినట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే డీజే వినియోగం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని SP కోరారు.

Similar News

News February 13, 2026

ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.

News February 13, 2026

VJA: గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

image

విజయవాడలోని లోక్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కలిశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ లక్ష్యాలను, అభివృద్ధి దిశను స్పష్టంగా ప్రతిబింబించిందని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై గవర్నర్‌తో పవన్ చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

News February 13, 2026

తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

image

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>