News November 8, 2025
జగిత్యాల జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా మన్నెగూడెంలో 15.0℃, రాఘవపేట 15.1, గోవిందారం 15.2, కథలాపూర్ 15.3, ఐలాపూర్, మల్లాపూర్ 15.4, జగ్గసాగర్ 15.6, రాయికల్ 15.7, పుడూర్, మద్దుట్ల, కోరుట్ల 15.8, గొల్లపల్లె, మల్యాల, గోదూరు 15.9, పొలాస, పెగడపల్లె 16.2, మేడిపల్లి 16.3, సారంగాపూర్, నేరెల్ల 16.4, జగిత్యాల, తిరమలాపూర్ 16.5, మెట్పల్లె, అల్లీపూర్ 16.6, బుద్దేష్‌పల్లిలో 16.8℃గా నమోదైంది.
Similar News
News January 15, 2026
GNT: జీఎంసీ నేటి సంక్రాంతి సంబరాలు ఇవే!

గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ స్థలంలో ఉదయం 9 గంటల నుంచి పొంగళ్లు, కోడి పందేలు, కర్రసాము, ఖోఖో, సాయంత్రం 5 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రి, బహుమతుల ప్రదానం జరగనుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం NTR స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి మ్యూజికల్ నైట్ ఉంటుంది.
News January 15, 2026
మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్‌పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్‌తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.
News January 15, 2026
జనవరి 15: చరిత్రలో ఈరోజు

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం


