News September 9, 2025

జగిత్యాల: జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

image

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం పూడూర్లో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యంపై ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాల గురించి రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తదితరులు ఉన్నారు.

Similar News

News December 14, 2025

కిష్టాపురం రెబల్ సర్పంచ్‌గా మాధవి!

image

తొర్రూరు మండలం కిష్టాపురం పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన తన సమీప అభ్యర్థి గూడెల్లి కొమరమ్మపై 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె విజయంతో గ్రామంలో తన అనుచరులు విజయోత్సవాలు నిర్వహించారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 14, 2025

ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

image

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2025

BREAKING: మెదక్‌లో తొలి ఫలితం

image

మెదక్ మండలం బాలానగర్ సర్పంచ్‌గా బెండ వీణ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వీణ సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. వీణ మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.