News December 3, 2025

జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

image

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.

Similar News

News February 18, 2026

వైవీయూ మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో MOU

image

యోగి వేమన యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ బెంగళూరు మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ తరఫున శేఖర్ బాబు వైవీయూ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాస్, ప్రొ. విజయ భారతి సంతకాలు చేశారు.

News February 18, 2026

రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

image

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలతో ఎగువసభలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. 37 సీట్లకు జరగనున్న ఈ ఎన్నికల్లో NDAకి మరో 6 సీట్లు పెరిగి టోటల్ ట్యాలీ 21కు చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమికి 4 సీట్లు తగ్గి విన్నింగ్ సీట్స్ 15కు పరిమితమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల అంచనా. ఇక TG, హరియాణా, హిమాచల్‌లో కాంగ్రెస్ స్థానాలు పెరగొచ్చు.

News February 18, 2026

జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలి’

image

ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్క్ అవుట్ చేయని ఇందిరమ్మ ఇళ్ల పట్టణ, రూరల్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వాటికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. మార్క్ అవుట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు.