News November 30, 2024
జగిత్యాల: తల్లిని తండ్రి కొడుతున్నాడని కొడుకు సూసైడ్
జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని KCR కాలనీ వెనుక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన రాకేశ్(20) తల్లి సాయమ్మను తన తండ్రి హనుమంతు తరచూ కొడుతున్నాడు. తాను చనిపోతేనైనా తన తండ్రి తల్లిని కొట్టడం ఆపేస్తాడని అనుకుని కోరుట్ల శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 12, 2024
మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?: KTR
రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? రూ.50 వేల కోట్లు, రూ.65 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా స్టేటస్ Xలో షేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ రూ.22,406 కోట్లు అని ఆర్బీఐ పేర్కొందని అన్నారు. కాకి లెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా అని విమర్శించారు.
News December 12, 2024
కోరుట్ల: 5 నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్
కోరుట్లకు చెందిన 5 నెలల చిన్నారి శీలం శ్రీకృతి అరుదైన రికార్డు సాధించింది. 5 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులు, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. అతి చిన్న వయసులో ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంతో చిన్నారిని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి ఛాంబర్‌లో చిన్నారి తల్లిదండ్రులను పావని – వంశీని అభినందించారు.
News December 12, 2024
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు మాస్టర్ ప్లాన్
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది మే 15 నుంచి జరిగే సరస్వతీ పుష్కరాల కోసం అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ రంగ సంస్థ నిపుణులు ఆలయంలో భక్తుల క్యూలైన్లు, వచ్చి పోయే మార్గాలు, రహదారులను పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వీఐపీ, పుష్కర ఘాట్, ప్రధాన రహదారులను సందర్శించారు. ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.