News October 8, 2025
జగిత్యాల: తల్లిని వదిలేసిన కొడుకులపై చర్యలు

జగిత్యాల పట్టణానికి చెందిన కట్లోరి అనసూయ(70)ను కొడుకులు, కోడళ్లు నిర్లక్ష్యం చేయడంతో ఆమె ఆల్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌ను ఆశ్రయించింది. ఆర్డీవో మధుసూదన్ వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో అంతర్గామ్ గ్రామానికి చెందిన పోకల గంగమ్మ కేసులో కౌన్సిలింగ్ తర్వాత ఆమె కొడుకులు తల్లిని పోషించేందుకు సమ్మతి పత్రం అందజేశారు.
Similar News
News January 13, 2026
ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
News January 13, 2026
బీబీనగర్: భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బీబీనగర్‌లోని తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
News January 13, 2026
సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోండి: తిరుపతి DEO

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలని తిరుపతి DEO KVN కుమార్ సూచించారు. త్వరలోనే అర్హులైన వారి జాబితా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వస్తుందన్నారు. అర్హుల జాబితాను https://www.bse.ap.gov.in వెబ్‌సైట్లో పెడతారని చెప్పారు. HMలు, తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


