News April 2, 2024
జగిత్యాల: పురుగు మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

పురుగు మందు తాగి ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మద్దులపల్లికి చెందిన వైష్ణవి(20) KNRలోని ఓ ప్రైవేట్ కళాశాలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.
Similar News
News February 18, 2026
వీణవంక జాతర ఘటనపై డీజీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
News February 18, 2026
KNR: తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేసుకోవాలి: కలెక్టర్

కేంద్ర పథకాల లబ్ధి పొందేందుకు కరీంనగర్ జిల్లాలోని రైతులందరూ విధిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలో 2,09,450 మంది రైతులకు గాను, ఇప్పటివరకు 1,21,814 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 87,636 మంది కోసం ఈ నెల 19 నుంచి 28 వరకు ఏఈఓలు, మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
News February 18, 2026
KNR: ‘మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత’

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కోఆర్డినేషన్’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మత్తుమందులు విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 37 కేసులు నమోదు చేసి, 87 మందిని అరెస్ట్ చేశామన్నారు.


