News November 30, 2025

జగిత్యాల: బాధితులకు తక్షణ సహాయం: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కొండగట్టులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా 20 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసులు స్పందించి మంటలను ఆర్పారు. బాధితులను స్థానిక పాఠశాలకు తరలించి ఆహారం, వస్త్రాలు అందించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Similar News

News February 9, 2026

NTR: జగన్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం.. కేసు నమోదు

image

మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన నేపథ్యంలో మైలవరానికి చెందిన అఖిల్ అనే యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రింగ్ సెంటర్‌లోని జగన్ ఫ్లెక్సీకి బ్లేడుతో చేయి కోసుకుని రక్త తిలకం దిద్దాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బహిరంగంగా అలజడి సృష్టించినందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2026

కిరాణాషాపులకు దెబ్బ?

image

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?

News February 9, 2026

నేటితో క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరఫున మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ తరఫున పువ్వాడ, నామా, వద్దిరాజు ఓట్లు అభ్యర్థించనున్నారు. వామపక్ష నేతలు కూడా తమ అభ్యర్థుల కోసం విస్తృతంగా పర్యటించనున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.