News September 11, 2025
జగిత్యాల: బావిలో దూకి యువతి SUICIDE

జగిత్యాల అర్బన్(M) ధరూర్‌కు చెందిన బాలె లక్ష్మణ్-పద్మల కుమార్తె దివ్య(26) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దివ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, గ్రామ పొలిమేరలోని ఓ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. దివ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
Similar News
News December 10, 2025
TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్‌పే చేయడంతోనే!

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్‌తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్‌గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్‌ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు
News December 10, 2025
సీడ్ యాక్సిస్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయింపు

రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం AP సీదాకు భూములను ఇచ్చిన ఉండవల్లి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాయపూడిలోని CRDA కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ – లాటరీలో భాగంగా 14 మంది రైతులకు 22 ప్లాట్లను ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా కేటాయించడం జరుగుతుందన్నారు. వీటిలో 14 రెసిడెన్షియల్ ప్లాట్లు, 8 కమర్షియల్ అన్నారు.


