News February 1, 2025
జగిత్యాల: బ్లాక్‌మెయిల్ ముఠాలో ఇద్దరి అరెస్ట్

జగిత్యాల జిల్లా పరిధిలో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురి ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడు జిల్లాలోని పరిశ్రమల అధికారి యాదగిరికి లంచం ఇస్తున్నట్లుగా వీడియో తీసి అతడిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.8.50 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు వివరించారు. .
Similar News
News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

NGKL మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల అనుమతి ఉందని డీఎఫ్ఓ అబ్దుల్ రావూఫ్ పేర్కొన్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందన్నారు. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వన్యప్రాణుల సంరక్షణార్థం చెక్ పోస్ట్ మూసి ఉండేదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి సీసాలు నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
News February 18, 2025
SSMB29 రెండో షెడ్యూల్ షురూ

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News February 18, 2025
నంద్యాల జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే నంద్యాలలో ఆదివారం, సోమవారం వరుసగా 37.23°, 37.22° ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీటితో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.