News May 7, 2025

జగిత్యాల: భూ భారతితో సత్వరమే పరిష్కారం: కలెక్టర్

image

భూ భారతి చట్టంతో భూమి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం వల్ల ఇన్నాళ్లు రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కొత్త మార్పులతో భూ భారతి చట్టం వచ్చిందన్నారు. సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామన్నారు.

Similar News

News February 13, 2026

రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.

News February 13, 2026

విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.

News February 13, 2026

ఉమ్మడి నల్గొండలో తొలి విజయం బీజేపీదే

image

యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాలను, తనను నమ్మి ఓటు వేసిన ఓటర్లకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. రాధ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.