News September 11, 2025

జగిత్యాల: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి చెందిన బురం దేవదాస్(50) ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన 2 నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. తన పిల్లలకు వివాహం చేయలేనని మనస్తాపం చెంది, భార్యతో గొడవపడి ఎలుకల మందు తాగి చనిపోయాడని చెప్పారు. అతడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 13, 2025

భూపాలపల్లిలో నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

జిల్లాలో మామునూరు, చొప్పదండి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 253 మందికి 181 మంది (హాజరు 72.01), కాటారం జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 198 మందికి 133 మంది హాజరైనట్లు డీఈఓ ఎం.రాజేందర్ తెలిపారు. మొత్తం 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

News December 13, 2025

సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం

image

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒత్తిడి దూరమవుతుందని నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. పట్టణంలోని SDR పాఠశాలలో 11వ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఐ కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

News December 13, 2025

వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.