News November 8, 2025

జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

image

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

BIG BREAKING: మేడారంలో క్యాబినెట్ మీటింగ్.. జరిగేది అక్కడే!

image

మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 18న సా.5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నామని స్పష్టం చేస్తూ తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులందరూ పాల్గొననున్నారు. కాగా రాజధానిలో కాకుండా తొలిసారిగా ఇతర ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News January 16, 2026

రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

News January 16, 2026

IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

image

<>IFFCO <<>>అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఎస్సీ, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు జనవరి 29 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iffco.in/