News September 12, 2025

జగిత్యాల: లెక్క తేలింది.. ఎన్నికలే తరువాయి..!

image

జగిత్యాల జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల ఓటరు జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,07,263 ఉండగా, ఇందులో పురుషులు 2,89,266, మహిళలు 3,17,988, ఇతరులు 9 మంది ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. జగిత్యాల రూరల్ మండలంలో అత్యధికంగా, జగిత్యాల అర్బన్‌లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 20 ZPTC, 216 MPTC స్థానాలు ఉండగా 1,123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Similar News

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

News December 14, 2025

మెదక్: 2వ విడత 88.80% పోలింగ్

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 88.80% పోలింగ్ నమోదైంది.
చేగుంట 87.86%, మనోహరాబాద్ 90.35%, మెదక్ 91.64 %, నార్సింగి 89.01%, నిజాంపేట్ 85.27%, రామాయంపేట్ 88.42%, శంకరంపేట్ (ఆర్) 89.68%, తూప్రాన్ 87.98 % పోలింగ్ నమోదైంది. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షించారు.

News December 14, 2025

వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.