News April 10, 2025
జగిత్యాల వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 14, 2026
పాలమూరు: బొటానికల్ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

జడ్చర్ల డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.
News January 14, 2026
ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.
News January 14, 2026
HNK: సెమీస్‌కు ఒడిశా.. తెలుగు జట్ల నిష్క్రమణ

కాజీపేటలో జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీల్లో తెలుగు రాష్ట్రాల జట్ల ప్రస్థానం ముగిసింది. ప్రీ-క్వార్టర్స్‌లో తెలంగాణ, AP జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఏపీ(28-21) విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర జట్టు(16-23) ఓటమి చవిచూసింది. అటు ఒడిశా పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు దూసుకెళ్లాయి. గురువారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


