News August 23, 2025

జగిత్యాల: విద్యార్థిని కాపాడిన ట్రాఫిక్ ఎస్ఐ

image

జగిత్యాల గోవింద్ పల్లెకి చెందిన అన్నం చెంచులు కుమారుడైన చేతన్ పట్టణంలోని ప్రైవేటు హాస్టల్లో చేర్పించగా, తాను ఉండలేనని పారిపోయి లారీ కింద పడబోయాడు. ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ఆ బాలుడిని రక్షించి చనిపోవద్దని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బాలుడిని స్టేషన్‌కు తీసుకువెళ్లి బాలుడి తండ్రిని పిలిపించారు. ఇకపై బాలుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పంపారు.

Similar News

News January 22, 2026

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

image

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు.

News January 22, 2026

పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

image

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రో‌ల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.

News January 22, 2026

ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

image

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.