News December 2, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1911, కనిష్ఠ ధర రూ.1725; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2090, కనిష్ఠ ధర రూ.2000; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2201, కనిష్ఠ ధర రూ.2131; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2301, కనిష్ఠ ధర రూ.2281; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3011, కనిష్ఠ ధర రూ.2130గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News February 17, 2026
గద్వాల్: ఈ నెల 23 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈనెల 23 నుంచి 27 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రవల్లిలోని 10వ పోలీస్ బెటాలియన్‌లో జరగనున్న ఈ శిబిరంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018పై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. అయిజ, ఇటిక్యాల, రాజోలి, మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి మండలాల సర్పంచులు ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 17, 2026
నిజామాబాద్ జిల్లాలో భైంసా వాసి మృతి

భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన పాట్రోల్ల మాణిక్యం (38) నిజామాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పశువులను మేపేందుకు ముగ్పాల్ మండలం చిన్నాపూర్ శివారుకు వెళ్లిన మాణిక్యం.. అక్కడ హన్మాన్ చెరువులో దిగగా లోతు తెలియక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ముగ్పాల్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. భైంసా వాసి పక్క జిల్లాలో మృతి చెందడంతో దేగాం గ్రామంలో విషాదం నెలకొంది.
News February 17, 2026
బంగ్లా ప్రధానిగా తారిఖ్ ప్రమాణం.. భేటీ అయిన ఓం బిర్లా

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ ఢాకాలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు తారిఖ్‌తో బిర్లా ప్రత్యేకంగా సమావేశమై భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 297 సీట్లకు గాను ఆ పార్టీ 209 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.


