News November 17, 2025

జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

image

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్‌లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్‌టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.

Similar News

News January 14, 2026

కామారెడ్డి: పండుగ పూట విషాదం

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కొంపల్లి సాయిలు గ్రామ శివారులోని లింగోష్ పల్లి చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు మృతుని కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ చెప్పారు.

News January 14, 2026

ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

image

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.

News January 14, 2026

NTR: సారోళ్లు రూల్స్ చెప్తారు.. అమలు చేయరు.!

image

సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ పతాక స్థాయికి చేరింది. HYD నుంచి APకి వెళ్లే బస్సు టికెట్ ధరలు రూ.6వేలు దాటడం గమనార్హం. ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామన్న రవాణా శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.