News November 5, 2025

జగిత్యాల: శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివ లింగం ఎక్కడుందంటే?

image

త్రేతాయుగంలో లంక యుద్ధం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్తూ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో ఆయన రాక్షస సంహారం చేసిన పాప విమోచనార్థం శివారాధన చేయాలని సంకల్పించి, స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే శ్రీ రామలింగేశ్వర స్వామి. కాలక్రమేణా ఆ ప్రదేశం మల్లాపూర్ మండలం “వాల్గొండ”గా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా భక్తులు ఇక్కడికి వచ్చి రామ-శివుల ఆరాధనతో పుణ్యఫలం పొందుతున్నారు.

Similar News

News January 14, 2026

అధిక చార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు: తూ.గో RTO

image

సంక్రాంతి వేళ ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ మంగళవారం హెచ్చరించారు. RTC ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

News January 14, 2026

పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

image

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుండి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.

News January 14, 2026

ప్యాసింజర్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

image

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్‌కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్‌ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.