News April 24, 2025

జగిత్యాల: సమస్యకు పరిష్కారం ఆలోచించాలి: ఎస్పీ

image

సమస్యకు పరిష్కారం ఆలోచించాలి తప్పా, మానసిక వేదనకు గురి కాకూడదని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి గురువారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, అధికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య ఉంటే ఆయన తెలియజేయాలన్నారు. వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో పోలీస్ శాఖ ఒకటన్నారు. 

Similar News

News March 9, 2026

భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

image

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్‌లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 9, 2026

మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లీడర్‌ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.

News March 9, 2026

గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

image

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.