News December 2, 2025

జగిత్యాల సర్పంచ్‌కి 508.. కరీంనగర్ సర్పంచ్‌కి 431

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌లో రెండోవిడతలో 418 GPలకు, 3794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడతకు సంబంధించి రెండోరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 431, వార్డు సభ్యులకు 1287, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 311, వార్డు సభ్యులకు 692, జగిత్యాల సర్పంచ్‌కి 508, వార్డు సభ్యులకు 1279, PDPL సర్పంచ్‌కి 295, వార్డు సభ్యులకు 810 నామినేషన్లు వచ్చాయి.

Similar News

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.

News February 13, 2026

BIG BREAKING: గజ్వేల్: KCR ఇలాకాలో BRS గెలుపు

image

మాజీ సీఎం KCR ఇలాకా గజ్వేల్‌లో BRS విజయం సాధించి మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు BRS సాధించింది. 7 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు బీజేపీ, 1 వార్డు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 11 సాధించడంతో BRS మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

​మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

image

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.