News December 2, 2025

జగిత్యాల: సర్పంచ్‌కు 622.. వార్డు సభ్యులకు 2493

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 122 గ్రామాల్లోని 1172 వార్డులకు వచ్చిన నామినేషన్‌లను స్క్రూటినీ చేసిన అనంతరం చెల్లుబాటైన నామినేషన్‌ల సంఖ్యను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 622 నామినేషన్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు 2493 నామినేషన్‌లు చెల్లుబాటు అయినట్లు తెలిపారు.

Similar News

News February 18, 2026

18 నుంచి కొడవటంచలో విగ్రహ పునః ప్రతిష్ఠ

image

కొడవటంచలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న చిన్నజీయర్ స్వామి వారితో పాటు స్పీకర్, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం ఈ నెల 26 నుంచి మార్చి 5 వరకు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

News February 18, 2026

HYDలో మళ్లీ 2BHK ఇండ్లు

image

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

News February 18, 2026

భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: ASF కలెక్టర్

image

బుధవారం ASF కలెక్టరేట్‌లో భూ సమస్యలపై కలెక్టర్ హరిత సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను తహశీల్దార్ ఫైళ్లతో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. తిరస్కరణల కారణాలు నమోదు చేయడం, ప్రజావాణి సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తుల నివేదికలను సమర్పించడాన్ని పర్యవేక్షించాలని వివరించారు.