News December 2, 2025
జగిత్యాల: ‘సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత’

సైబర్ భద్రత ప్రతి పౌరుని బాధ్యత అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ‘ఫ్రాడ్ క ఫుల్ స్టాప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్ ఆడిటోరియం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల గురించి రక్షించుకోవాలంటే అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు

AP: దేశంలోని ప్రఖ్యాత క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో 102వ ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. FEB 11 వరకు జరిగే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు RTC, రైల్వే స్టేషన్ల నుంచి ఆలయానికి బస్సులను ఏర్పాటుచేశారు. కాగా 1937 నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. వేళాంగిణీ మాత(TN) ఆలయం తర్వాత రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా గుణదల ప్రసిద్ధి.
News February 9, 2026
ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడితో మోదీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసిన సైనికుడు జయరాజ్ రాజారావును PM మోదీ కలిశారు. మలేషియాలో పర్యటనలో ఉన్న ఆయన కౌలాలంపూర్‌లో ఈ మేరకు భేటీ అయ్యారు. ‘రాజారావు జీవితం అపార ధైర్యం, త్యాగాలతో నిండింది. ఆయన అనుభవాలను వినడం స్ఫూర్తి కలిగించింది. భారతదేశ భవితవ్యాన్ని రూపొందించడంలో సాయపడిన INA సైనికులు, నేతాజీకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని మోదీ పేర్కొన్నారు.
News February 9, 2026
చంద్రుడిపై సిటీ నిర్మాణం.. పదేళ్లలోనే పూర్తి: మస్క్

చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై SpaceX దృష్టిసారించిందని, ఇది 10ఏళ్లలోనే పూర్తవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంగారకుడిపై దీనికి 20+Y పడుతుందన్నారు. ‘గ్రహాలు 26 నెలలకొసారి సమాంతరంగా చేరినప్పుడే 6 నెలల్లో మార్స్‌కు ప్రయాణించగలం. 10 రోజులకోసారి 2 రోజుల్లో చంద్రుడిపైకి వెళ్లొచ్చు కాబట్టి అక్కడ సిటీని వేగంగా పూర్తిచేయగలం. భవిష్యత్తు నాగరికతను కాపాడటమే మా లక్ష్యం’ అని Xలో పేర్కొన్నారు.


